పశ్చిమాసియా సంక్షోభాన్ని ఆపేందుకు ఈజిప్ట్, పాకిస్థాన్, టర్కీ దేశాలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న దాడిని ఆపేందుకు ఆ దేశాలు ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ప్లాన్‌ను రెఢీ చేసినట్లు భావిస్తున్నారు. హోర్ముజ్ జలసంధి రీఓపెనింగ్ అంశంపై ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధానికి బ్రేక్ వేయాలంటే, 45 రోజల పాటు కాల్పుల విరమణ పాటించాలని పశ్చిమాసియా అధికారులు వెల్లడించారు. శాశ్వతమైన కాల్పుల విరమణ జరగాలంటే, తొలుత ఇరాన్, అమెరికా దేశాలు 45 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకారం తెలుపాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఇరాన్, అమెరికా మాత్రం ఇంత వరకు ఈ ప్రతిపాదనపై ప్రకటన చేయలేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచి, పశ్చిమాసియా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్కు కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదన అందినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరాన్, అమెరికా అంగీకరిస్తాయా లేదా అన్న అంశంపై క్లారిటీ లేదు. అయితే ఆర్థిక నష్టాన్ని కల్పించే వరకు, మరోసారి దాడి చేయబోమని హామీ ఇచ్చే వరకు వెనుకడుగు వేసేది లేదని ఇరాన్ చెబుతోంది. ఇక ట్రంప్ మాత్రం తన వార్నింగ్‌లను జారీ చేస్తూనే ఉన్నారు.


