ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును రాజ్యసభలోనూ ఆమోదించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆమోద ముద్ర లభిస్తే ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా చరిత్రలో నిలిచిపోతుంది. తాజాగా అమెరికాలోని బే ఏరియాలో ఎన్నారై టీడీపీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉన్న డబ్లిన్, ప్లజెంటన్ నగరాల్లో ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో ఈ సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ల పిలుపు మేరకు వీధుల్లోకి వచ్చి దీపాలు వెలిగించి తమ హర్షం వ్యక్తం చేశామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ నేతలు భక్త బల్ల, సుభా యంత్ర, వెంకట్ అడుసుమిల్లి, సత్యం పసల, కరీం, ప్రసాద్ బండారు, వెంకట్ గుడాల, జగదీష్ తాల్లూరి, భీమ్ బొమ్మ, శ్రీనివాస్ వీరమాచినేని, రవి మేడెపూడి, వంశీ కట్ట, మధు కట్ట, కిషోర్ బుద్ధ, సురేష్ నల్లపాటి, రాజేష్ నల్లూరి, భాను బిరుదురాజు, ప్రదీప్ నర్రా, నిఖిల్ దాది, సుధీర్ ఉన్నం, కరీమ్, ప్రేమ్ మక్కెన, సునీల్ సుదనగుంట పాల్గొన్నారు.


