చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర. మల్లిడి వశిష్ఠ డైరెక్షన్. త్రిష ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా, అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశ్వంభర చిత్రాన్ని జులై 10న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఇన్‌సైడ్ టాక్. ఇప్పటికే పలు రకాల తేదీలు తెరపైకి రావడంతో అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు మూవీ లవర్స్, అభిమానులు. విశ్వంభర చాలా కాలంగా ఆలస్యమవుతూ వస్తున్న నేపథ్యంలో మేకర్స్ వీడియో కంటెంట్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ చేస్తే ప్రేక్షకుల మైండ్స్‌లో బలంగా గుర్తుండిపోతుందని పలువురు నెటిజన్లు, మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన విశ్వంభర టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. విశ్వంభరలో చిరంజీవి, బాలీవుడ్ భామ మౌనీ రాయ్‌పై స్పెషల్ సాంగ్ ఉండబోతుందని తెలిసిందే.


