పార్లమెంట్ ఆవరణలో ఇవాళ అరుదైన దృశ్యం చోటుచేసుకున్నది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ప్రధాని మోదీ కాసేపు మాట్లాడారు. కారు నుంచి దిగి వెళ్తున్న మోదీ కాసేపు ఆగి రాహుల్‌తో ముచ్చటించారు. చాలా దగ్గర నిలుచుకున్న ఆ ఇద్దరూ ఓ నిమిషం పాటు మాట్లాడుకున్నారు. పార్లమెంట్‌లో ఎప్పుడూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునే కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఆ మీటింగ్ పట్ల ఆసక్తి కనబరిచారు. పార్లమెంట్ ఆవరణలో ఉన్న ప్రేరణ స్థల్‌కు మోదీ వెళ్లారు. మహాత్మా జ్యోతిభా పూలే 200వ జయంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు మోదీ వెళ్లారు. అయితే ఆ మార్గంలో ఉన్న రాహుల్‌తో ఆయన కాసేపు ముచ్చటించారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ కూడా ఉన్నారు. అయితే రాహుల్, మోదీ ఏం మాట్లాడుకున్నరన్న దానిపై క్లారిటీ లేదు.


