నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న కాయడు లోహర్ నేడు పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో కాయడు రెట్రో లుక్‌లో అలరిస్తుంది.
ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా. శ్ళ్వ్ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్ స్లమ్ ఏరియా నేపథ్యంలో పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాని జడల్ అనే ఊర మాస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రా స్టేట్మెంట్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ చిత్రం ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


