ఇరాన్‌తో శాంతి చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు అతిపెద్ద చమురు ఆర్థిక వ్యవస్థలైన రష్యా, సౌదీ అరేబియా కంటే తమ వద్దే ఎక్కువ చమురు ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యంత నాణ్యత కలిగిన చమురు, గ్యాస్‌ను నింపుకోవడానికి ప్రపంచ దేశాలకు చెందిన అనేక ఖాళీ చమురు ట్యాంకర్లు అమెరికా తీరంవైపు వస్తున్నాయని పేర్కొన్నారు. మేం మీకోసం ఎదురు చూస్తున్నాం.. త్వరితగతిన స్పందించండి అంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడికైనా చమురు ఎగుమతి చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు.


