అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్ నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ఎట్టా ఎట్టా వీడియో సాంగ్‌ను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, వంశీ ఐరటనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఒక వైవిధ్యమైన మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


