బీహార్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు సమ్రాట్ చౌదరి (ఏప్రిల్ 15) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు చౌదరితో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. నితీష్ కుమార్ సిఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత, సమ్రాట్ చౌదరి బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యాడు. బీహార్‌లో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సమ్రాట్ చౌదరి పేరును ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలు రేణు దేవి, మంగళ్ పాండే, దిలీప్ జైస్వాల్ బలపరిచారు. దీంతో బీహార్‌లో బీజేపీ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తిగా సమ్రాట్ నిలవనున్నారు. ఏళ్ల తరబడి రాష్ట్ర సంకీర్ణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ పార్టీ, ఇప్పుడు స్వతంత్రంగా ప్రభుత్వాన్ని నడిపించనుంది.


