మహిళా రిజర్వేషన్ నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు కోరుతూ రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాష్ట్రంలోని రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. 2029 ఎన్నికల నుంచే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా తీసుకువస్తున్న నారీ శక్తి వందన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలకాలని లేఖలో కోరారు. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు తదితర నాయకులకు ముఖ్యమంత్రి లేఖలు పంపారు.


