My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra - Latest News - National & International - Telangana

అమిత్ షా కీలక ప్రకటన.. ఏపీకి 38.. తెలంగాణకు 26

 లోక్‌సభలో మహిళల రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ప్రచారం తప్పని, డీలిమిటేషన్ వల్ల ఆ రాష్ట్రాలకు తగిన రీతిలో సీట్లు పెరుగుతాయని వివరించారు. డీలిమిటేషన్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగదని అమిత్ షా స్పష్టం చేశారు.డీలిమిటేషన్ తర్వాత ఏపీలో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 25 […]

 లోక్‌సభలో మహిళల రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ప్రచారం తప్పని, డీలిమిటేషన్ వల్ల ఆ రాష్ట్రాలకు తగిన రీతిలో సీట్లు పెరుగుతాయని వివరించారు. డీలిమిటేషన్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగదని అమిత్ షా స్పష్టం చేశారు.డీలిమిటేషన్ తర్వాత ఏపీలో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయని అమిత్‌ షా వెల్లడించారు. అలాగే తెలంగాణలో లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కి పెరుగుతాయన్నారు. తమిళనాడులో 39 నుంచి 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కి, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయన్నారు. మొత్తంగా 50 శాతం సీట్లు పెరుగుతాయన్నారు.

దక్షిణాది జనాభా శాతం కంటే సీట్లు ఎక్కువగా పెరుగుతాయని అమిత్ షా చెప్పారు. విపక్షాలు అబద్ధాలు చెబుతూ ప్రజలను అనవసరంగా ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. అన్ని ప్రాంతాలకూ సమాన న్యాయం జరుగుతుందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం 543 ఉన్న లోక్‌సభ సీట్లను డీలిమిటేషన్ తర్వాత దాదాపు 50% పెంచి 850 వరకు తీసుకెళ్లే ప్రణాళిక ఉందని కేంద్రం తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.