స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తుండగా, తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ తస్సాదియ్య వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి అద్భుతమైన బాణీలు అందించగా, తస్సాదియ్య పాట ఒక ఫ్యామిలీ పార్టీ సాంగ్‌లా ఉండి, వినేవారిలో జోష్ నింపుతోంది. ఈ పాటను ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద, పుణ్య కలిసి పాడారు. సమంత తనదైన స్టెప్పులతో ఈ వీడియో సాంగ్‌లో సందడి చేశారు. ఓ బేబీ వంటి హిట్ తర్వాత సమంత, దర్శకురాలు బి.వి. నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాలో సమంత ఒక సాధారణ ఇల్లాలుగా కనిపిస్తూనే, తన కుటుంబాన్ని కాపాడుకునే పవర్‌ఫుల్ మహిళగా కనిపించబోతున్నారు. సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ సినిమాకు కథను అందిస్తున్నాడు.


