అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ జలక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆ విలీన ప్రక్రియను రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల సంఖ్య 10 నుంచి మూడుకు పడిపోయింది. ఇక బీజేపీ సంఖ్య 106 నుంచి 113కు చేరింది. ఇక రాజ్యసభలో ఎన్డీఏ బలంగా ఇప్పడు 141 నుంచి 148కి పెరిగింది. దీంతో రాజ్యసభలో మెజారిటీ మార్క్ అయిన 123 సంఖ్యకు బీజేపీ చేరువు అవుతున్నట్లు తెలుస్తోంది.


