గూగుల్ రాక ఏపీకి గేమ్ ఛేంజర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది దేశచరిత్రలో గుర్తుంచుకోదగిన రోజు అని అన్నారు. విశాఖ పట్నం తర్లువాడలో గూగుల్ ఏఐ సెంటర్ కు సిఎం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. విశాఖ పట్నం చాలా అందమైన ప్రదేశం అని ఏపీ చరిత్రలో మరిచిపోలేని రోజు అని ఈ ప్రాజెక్టు రాక ఉత్తరాంధ్రకు గర్వకారణం కొనియాడారు. టెక్నాలజీలో ఎపి సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుందని, ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ అని టెక్నాలజీలో దేశానికి ఏపీ గేట్ వేగా నిలుస్తుందని చంద్రబాబు తెలియజేశారు.
ఏపీ భారత్ గ్రోత్ ఇంజిన్ గా మారబోతుందని, ప్రపంచం గూగుల్ ను ఎంచుకుంటే, గూగుల్ ఎపిని ఎంచుకుందని ఆనందాన్నివ్యక్తం చేశారు. ఏపీలో ఇవాళ్టి నుంచి సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని, త్వరలోనే ప్రతీ సిటిజెన్ ఎఐ అసిస్టెంట్ ను ఆశ్రయిస్తారని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, అమెరికాను కలిపేలా కేబుల్ నిర్మాణం అని ఏపీ లాజిస్టిక్ హబ్ గా మారాలన్నదే తన లక్ష్యం అని దీనికి కేంద్రం నుంచి మద్దతు కోరుతున్నామని అన్నారు. ఎంవోయూ చేసుకోవడమే కాదు, దాన్ని ముందుకు తీసుకెళ్లడంపై ఫోకస్ పెడుతున్నామని, పెట్టుబడులు, ఒప్పందాలే కాదు, అవి కార్యరూపం దాల్చడం లోనూ ముందున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేష్ పాల్గొన్నారు.


