తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ అధినాయకత్వం పాత, కొత్త నాయకుల కలయికతో కమిటీలను ఏర్పాటు చేయడం ప్రత్యేకతగా నిలిచింది. టీడీపీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్ స్థాయి నేతలకు కూడా పొలిట్ బ్యూరోలో చోటు కల్పించడం విశేషంగా మారింది. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని నిజం చేస్తూ, కష్టపడి పని చేసిన నాయకులకు కమిటీల్లో ప్రాధాన్యం ఇచ్చారు.


