బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావులపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేసినట్లు కాంగ్రెస్ నేత సంపత్‌కుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ పార్టీపై తనపై తప్పుడు ప్రచారం చేసి పరువుకు భంగం కల్గిస్తున్నారన్నారని ఆయన మండిపడ్డారు. జన్వాడా ఫాం హౌజ్‌లో కట్టుకథలు రచించి లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్లను రూ.8కోట్లు అడిగినట్లు అసత్య ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి దానికి న్యాయపరమైన ప్రోసిజర్ ఉంటుందని తెలుసుకోవాలని ఆయన సూచించారు. అయితే తాను కాంగ్రెస్ భావజలం ఉన్న వ్యక్తి అని, ఇలాంటి ప్రచారాలకు భయపడను అని వారిని హెచ్చరించారు. ఒకానొక సమయంలో రూ.30కోట్లు ఇస్తాను అని, పార్టీ మారు అని హరీశ్‌రావు స్రంపదించారని తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేసేవారికి ఏదో ఒక రోజు శిక్ష పడడం ఖాయమని అన్నారు. రాజకీయాలు చేతకాకపోతే కేసీఆర్ మాదిరిలా ఫాంహౌజ్‌లో పడుకోండని దుయ్యబట్టారు.


