కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కవిత సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. “తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నాము. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ, ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పని చేస్తానని తెలియజేస్తున్నాను. జనవరి 2026 లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. అందులో మూడవ ప్రాధాన్యత గా మేము ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం.టిఆర్ఎస్ నాకు రాసిపెట్టుందేమో!!” అంటూ కవిత ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు.


