ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఆయన పరాజయాన్ని చవిచూశారు. కొళత్తూరు నియోజకవర్గం నుంచి ఎంకే స్టాలిన్ పోటీ చేశారు. 1996 తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. గత మూడు ఎన్నికలుగా కొలత్తూరు నుండి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న స్టాలిన్ కు, ఈసారి టీవీకే అభ్యర్థి నుండి ఊహించని స్థాయిలో పోటీ ఎదురైంది. చివరకు టీవీఎస్ అభ్యర్థి వీఎస్ బాబు స్పష్టమైన ఆధిక్యంతో ఘన విజయం సాధించారు.


