మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఎపిక్ విశ్వంభర సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా నటి త్రిష కృష్ఱన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆమె క్యారెక్టర్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ పోస్టర్‌లో త్రిష ట్రెడిషనల్ లుక్‌లో డివైన్ ఔరాతో కనిపిస్తూ ఆకట్టుకుంది. అయితే ఇది కేవలం గ్లామర్ పాత్ర మాత్రమే కాదని, కథలో కీలక పాత్ర పోషించబోతుందని స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, త్రిష పోషిస్తున్న అవని పాత్ర సినిమా కథలో కీలక మలుపులు తీసుకువచ్చే ప్రధాన అంశంగా ఉండనుంది.
త్రిషకు విశ్వంభర ఒక స్ట్రాంగ్ కంబ్యాక్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో పవర్‌ఫుల్ పాత్ర దక్కడం ఆమె కెరీర్‌కు మరో మైలురాయిగా మారవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు వశిష్ట విజువల్ ట్రీట్ ఇవ్వడానికి భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్ స్టూడియోలు ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నాయని సమాచారం. దీంతో విశ్వంభ విజువల్‌గా కూడా అద్భుతంగా ఉండనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వేగంగా కొనసాగుతోంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం టాలీవుడ్‌లో నెవర్ బిఫోర్ అనిపించే స్థాయిలో ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో రూపొందుతోంది. మేకర్స్ త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశముంది.


