ప్రపంచ దేశాలకు ఇదో గుడ్ న్యూస్. కొద్ది రోజులుగా మూసి ఉన్న హార్ముజ్ జలసంధి త్వరలోనే తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం.. హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై గురువారం రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. హార్ముజ్‌ను వీలైనంత త్వరగా, దశలవారీగా అందుబాటులోకి తేవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే హార్ముజ్ విషయంలో పూర్తి ఒప్పందం కుదిరి, జలసంధి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే, ఇక్కడ చిక్కుకుపోయిన నౌకల్ని కూడా ప్రయాణించేందుకు అనుమతివ్వనున్నారు.


