పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి రద్దు చేశారు. ముఖ్యమంత్రి పదవికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో, గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్లో శనివారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. శుక్రవారం బీజేపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అసెంబ్లీ రద్దుతో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గవర్నర్ రవి బర్తరఫ్ చేసినట్లు అయింది.
దీంతో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు ముహూర్తం ఖరారు చేశారు. మే 9వ తేదీ ఉదయం10 గంటలకు ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సమీక్ భట్టాచార్య ప్రకటించారు.


