గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న మరుసటి రోజునే భారత విద్యార్థి గుండెపోటుతో మరణించిన ఘటన అమెరికాలో జరిగింది. మహమ్మద్ కుమెల్ షేక్ (26) శాన్ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఇటీవలే స్నాతకోత్సవ వేడుకల్లో … తన గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. అయితే, ఆ మరుసటి రోజే కుమెల్ తన నివాసంలో విగతజీవిగా కనిపించడంతో స్నేహితులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. నిద్రలోనే కార్డియాక్ అరెస్టుకు గురై మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థి మృతి పట్ల అమెరికాలోని భారత కమ్యూనిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కుమెల్ మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.


