స్టార్ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే కానుక అందించింది. యువ దర్శకుడు రవికిరణ్ కోల దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం రౌడీ జనార్థన. ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ ఇంటెన్స్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. అతడి గుండెపై హీరోయిన్ కాలుపెట్టగా, ప్రపంచంతో పోరాడే మొండివాడు, కానీ ప్రేమకు మాత్రమే తలవంచుతాడు అంటూ ఈ పోస్టర్‌కి క్యాప్షన్ ఇచ్చారు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


