న్యూఢిల్లీలో మే 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్జి హాజర్యే అవకాశం ఉందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం నేపథ్యంలో భారత్‌లో బ్రిక్స్ సదస్సు జరగడం, దానికి ఇరాన్ మంత్రి హాజరవ్వడం కీలక పరిణామం. ఢిల్లీలో జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఇరాన్ న్యాయ, అంతర్జాతీయ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాది కూడా హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, 2024లో బ్రిక్స్ దేశాల జబాతాలో ఈజిప్టు, ఇథియోపియో, సౌది అరేబియా, యుఎఇలతోపాటు ఇరాన్ కూడా చేరింది. బ్రిక్స్ సదస్సుకి భారత్ 2012, 2016, 2021, ఇప్పుడు 2026లో అధ్యక్షత చేపట్టింది.


