రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చి బాబు సానా దర్శకత్వం. ఫస్ట్-లుక్ పోస్టర్ల, రెండు చార్ట్ బస్టర్ పాటలు, రెండు డిఫరెంట్ గ్లింప్స్, ప్రతి అప్‌డేట్‌కు అద్భుతమైన స్పందన లభించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన పెద్ది, జూన్ 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి బలమైన తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ చిత్రం ట్రైలర్‌ను ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ద్వారా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసారు.మే 18న ముంబైలో జరగబోయే ఈవెంట్ ద్వారా ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ మార్కెట్‌పై కూడా భారీ స్థాయిలో ఫోకస్ పెట్టిన చిత్ర బృందం, ట్రైలర్ లాంచ్‌ను బాలీవుడ్ మీడియా సమక్షంలో నిర్వహించేందుకు సిద్ధమవడం చర్యనీయాంశం అయింది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు ముంబై ప్రధాన ప్రమోషనల్ హబ్‌గా మారిన నేపథ్యంలో పెద్ది టీమ్ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతోందని తెలుస్తోంది.ఈ ట్రైలర్ ఈవెంట్‌కు చిత్ర యూనిట్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.


