తెలుగమ్మాయి శ్రీలీలకు తమిళంలోనూ మంచి క్రేజే ఉంది. రీసెంట్‌గా పరాశక్తి సినిమాతో తమిళ ప్రేక్షకుల్ని పలకరించింది శ్రీలీల. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఈ తెలుగందానికి మాత్రం మంచి గుర్తింపే దక్కింది. ఆమె మాట్లాడుతూ నేను డాక్టర్‌ని. అనుకోకుండా యాక్టర్‌ని కూడా అయ్యాను. ఈ రెండూ నాకు గర్వకారణాలే. ఈ క్రెడిట్ మా అమ్మవల్లే నాకు దక్కింది. జీవితంలో జయాపజయాలు సహజం. అపజయం ఎదురైనప్పుడు ఓ గంట ఏడుస్తాను. తర్వాత నెక్ట్స్ అంటూ రెడీ అయిపోతా. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు ఇప్పుడు హిందీలోనూ నటిస్తున్నా. అక్కడ నన్ను కొందరు లేడీ సూపర్‌స్టార్ అంటున్నారు. దానికి నేను ఒప్పుకోను. లేడీ సూపర్‌స్టార్ అంటే మా అక్క నయనతార మాత్రమే. నయన్ మాదిరిగా నేనూ తమిళం అబ్బాయినే పెళ్లాడతానేమో అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల. విమానప్రయాణం చేసేటప్పుడు ల్యాండింగ్ అంటే నాకెంతో భయం. ల్యాండయ్యాక పైలెట్, ఇతర యూనిట్ మొత్తానికి షేక్‌హ్యాండిచ్చి ధన్యవాదాలు చెప్పాలని అమ్మ చెబుతుండేది. దాన్ని తూచ తప్పక పాటిస్తుంటా అంటూ గుర్తు చేసుకున్నది శ్రీలీల.


