స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ఫీమేల్ సెంట్రిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుండటంతో సినీ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. మొదట ఈ సినిమాను మే 15న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. దీంతో అభిమానులు కొత్త రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా చిత్రబృందం అధికారిక ప్రకటనతో క్లారిటీ ఇచ్చింది. మా ఇంటి బంగారం చిత్రాన్ని జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.


