తమిళనాడు సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా విజయ్ ప్రధాని మోదీని కలిశారు. న్యూఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ప్రధాని మోదీతో సీఎం జోసెఫ్ విజయ్ భేటీ అయ్యారు. గతంలో 12 ఏళ్లక్రితం మోదీని విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ, ఈసారి విజయ్ సీఎం హోదాలో ప్రధానిని కలవడం విశేషం. మోదీ, విజయ్ ఈరోజు దాదాపు 25 నిమిషాలపాటు భేటీ అయినట్లు తెలుస్తోంది. మోదీతో భేటీ అనంతరం విజయ్, న్యూఢిల్లీలోని తమిళనాడు హౌజ్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు అధికారిక స్వాగతం లభించింది. ఇది సీఎం హోదాలో విజయ్ మొదటి ఢిల్లీ పర్యటన.


