సిరి క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ మోడల్ రచనా దర్శకత్వంలో తానే హీరోగా నటిస్తూ రూపొందించిన సినిమా ఒక్క అడుగు. సినీ ప్రముఖులు విఎన్ ఆదిత్య, అశోక్ కుమార్, సముద్ర, పద్మిని నాగులపల్లి, రామ సత్యనారాయణ, సత్య మాస్టర్ చేతుల మీదగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ జరిగింది. నటుడు మురళి, సత్య మాస్టర్, ఎంవి రఘు, నిర్మాత పద్మిని నాగులపల్లి, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్, దర్శకుడు సముద్ర, డాక్టర్ కిరణ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. దర్శకుల సంఘం ప్రెసిడెంట్ విఎన్ ఆదిత్య మాట్లాడుతూ ఈ సినిమాతో శేఖర్ నటుడు, నిర్మాత, దర్శకుడు అనే మూడు అడుగులు వేశారు. తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ప్రేక్షకుల ముందు కు రానున్నారు. ఆయన మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే నిర్మాతగా కూడా ఆయనకు మంచి లాభాలు రావాలని సరికొత్త పంథాలోఒక్క అడుగు కోరుకుంటున్నాను అని అన్నారు.
నాకు నేనే ఒక అవకాశం కలిపించుకుంటూ ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా కోసం నేను అన్ని రంగాలలో అవగాహన పెంచుకున్నాను. ఒక సినిమా చేయడం సులభమే, కాని విజయవంతమైన సినిమా చేయడం, ఆ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకుని వెళ్ళడం కష్టం. మా సినిమాకి అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను అని నటుడు, దర్శక నిర్మాత శేఖర్ మోడల్ తెలిపారు.


