ఫోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌కు 3 రోజుల పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. ఇవాళ్టితో 3 రోజుల పోలీసు కస్టడీ గడువు ముగియడంతో విచారణ తర్వాత మల్కాజ్గిరి కోర్టులో హాజరు పర్చారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలుకు తరలించారు. . ప్రధానంగా బాధితురాలితో ఇన్స్టాగ్రామ్, వాట్సప్, స్నాప్చాట్లలో ఛాటింగ్లకు సంబంధించి కొన్ని ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. వాటి ఆధారంగానే భగీరథ్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.


