అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ శనివారం తన భర్త మైకేల్ బౌలోస్‌తో కలిసి ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను సందర్శించారు. దాదాపు గంటసేపు ఆ కట్టడంలో గడిపి అనేక విశేషాలు తెలుసుకున్నారు. తన భర్త బౌలోస్‌తోపాటు కొంతమంది సన్నిహిత స్నేహితులతో కలిసి శనివారం ఉదయం 11 గంటలకు ఆమె తాజ్‌మహల్‌కు విచ్చేశారు. తాజ్‌మహల్ లోని అనేక ప్రదేశాలను ఫోటోలు తీసుకున్నారు. తాజ్‌మహల్ చరిత్ర, నిర్మాణం గురించి ఆమె ఎక్కువ ఆసక్తి చూపించారని నిర్మాణానికి సంబంధించి అనేక ప్రశ్నలు అడిగారని టూరిస్టు గైడ్ రమేష్ దివాన్ పేర్కొన్నారు. సందర్శన పూర్తయిన తరువాత ఆమె తాజ్‌మహల్ అందాలను వర్ణించారని పర్యటనలో పొల్గొన్న యాత్రికులు చెప్పారు.
ఢిల్లీ నుంచి ఛార్టర్డ్ విమానంలో ఆగ్రా విమానాశ్రయానికి వచ్చిన టిఫానీ దంపతులు, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా హోటెల్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి గోల్ఫ్ కోర్సు రూటులో తాజ్‌మహల్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి తాజ్‌మహల్ వరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దారి పొడుగునా అదనపు పోలీస్ సిబ్బందిని నియమించారు. తాజ్‌మహల్ సందర్శన తరువాత టిఫాన్ ట్రంప్ దంపతులు ఆగ్రాలో రాత్రంతా బస చేస్తారు. అక్కడ నుంచి మిగతా ప్రాంతాల్లో పర్యటిస్తారు. శుక్రవారం టిఫానీ ఢిల్లీ లోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు.


