అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శ్రీనివాస మంగాపురం. హీరోగా జయకృష్ణ ఘట్టమనేని పరిచయం అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో, జెమినీ కిరణ్ తన చందమామ కథలు బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా శ్రీను- మంగా పాత్రలని పరిచయం చేస్తూ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో జయకృష్ణ మాట్లాడుతూ తాతయ్య నాకు దేవుడితో సమానం. ఇది నా తొలి చిత్రం. అజయ్ భూపతి ఈ కథ చెప్పినప్పుడు ఇందులో ఉన్న ఎమోషన్స్, నా పాత్రలోని డెప్త్ చాలా ఆకట్టు కున్నాయి. ఈ క్యారెక్టర్ ద్వారా నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవచ్చని, నటుడిగా నిరూపించుకునే అవ కాశం దొరుకుతుందని భావించాను అని తెలిపారు.
సూపర్ స్టార్ కృష్ణ క్వాలిటీస్ జయకృష్ణలో ఉన్నాయి. కచ్చితంగా జయకృష్ణ చాలా పెద్ద హీరో అవుతాడు. ఈ సినిమా ఆడియో ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది అని డైరెక్టర్ అజయ్ భూపతి చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, ఆదిశేషగిరిరావు తదితరులు ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. కె. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ శ్రీనివాస మంగాపురం అనే పేరు పెట్టడమే ఈ సినిమా మొదటి విజయం అని అన్నారు. ఈ సినిమా జూలై 9 మీ ముందుకు వస్తోంది అని అశ్వినీ దత్ చెప్పారు.


