మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ కెటిఆర్ కాంగ్రెస్ సర్కార్‌కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినప్పటికీ, ఇవ్వక తప్పనిసరి పరిస్థితి కల్పించింది మాత్రం కెసిఆరేనని అన్నారు. కెసిఆర్ పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందనేది నిర్వవాదాంశమని స్పస్టం చేశారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కెటిఆర్ మాట్లాడారు. 2014లో తెలంగాణలో సాగుబూమి విస్తీర్ణం 1.50 కోట్ల ఎకరాలు మాత్రమే. 2023 బిఆర్ఎస్ సర్కార్ దిగిపోయే సమయానికి సాగు భూమి విస్తీర్ణం 2.29 కోట్ల ఎకరాలు. దశాబ్ద కాలంలో సుసంపన్నమైన తెలంగాణను ఆవిష్కరించాం. రాష్ట్రాన్ని పరిపాలించే నాయకత్వ పటిమ మీకు ఉందా? అని ఆనాడు కొందరు అన్నారు. మాకు కెసిఆర్ లాంటి పాలకుడు కావాలని అనుకునేలా పదేళ్ల పాలన సాగింది. వ్యవసాయానికి కచ్చితంగా 24 గంటలు కరెంటు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎన్నికల అజెండాలో లేకున్నా, రైతులకు పెట్టుబడి సాయం చేసే రైతు బంధు తీసుకొచ్చాం. తలపరి ఆదాయంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపాం. నేను చెప్పినవన్నీ తప్పు అని నిరూపిస్తే, శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తా అని కెటిఆర్ సవాల్ విసిరారు.


