తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్, ఆమె భర్త, ప్రముఖ సినీ దర్శకుడు సుందర్ సి. తమ కుమార్తె అవంతిక వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి విజయ్ నివాసానికి వెళ్లిన ఖుష్బూ దంపతులు, తమ కుమార్తె అవంతిక, కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాసన్ ల వివాహ పత్రికను ఆయనకు అందజేసి ఆశీస్సులు కోరారు.


