మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ఇరుముడి నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేయగా, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక ప్రత్యేకమైన సాంగ్ అప్‌డేట్‌ను మేకర్స్ అధికారికంగా పంచుకున్నారు. గత కొన్ని రోజులుగా అభిమానుల నుంచి వస్తున్న భారీ రిక్వెస్ట్‌లను పరిగణనలోకి తీసుకుని, ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ ఇరుముడి థీమ్ సాంగ్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ పాట విళ్లాది వీరుడు వీర మణికంఠుడు అనే పవర్‌ఫుల్ అయ్యప్ప స్వామి భక్తి గీతంగా ఉండబోతోందని తెలుస్తుంది.
ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, ఇందులో రవితేజ ఒక ఎమోషనల్ తండ్రి పాత్రలో సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. కూతురి కోసం ఒక తండ్రి పడే తపన, మద్యపానానికి దూరమై అయ్యప్ప దీక్ష స్వీకరించి ఆధ్యాత్మిక మార్గంలో సాగే ఒక ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కూతురిగా కీలక పాత్ర పోషిస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఆగస్టు 2026లో థియేటర్లలోకి రానుంది.


