తెలంగాణలో రేపటి నుంచి భూముల మార్కెట్ విలువలు పెంచుతున్నట్లు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.సచివాలయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకర్లతో మీడియాతో మాట్లాడారు. భూముల ధరలు ఏరియాను బట్టి 50 నుంచి100 శాతం పెరుగుతాయని తెలిపారు. ప్రైమ్ ఏరియాలో 100 శాతం పెరుగుతాయన్నారు. భూముల వ్యాల్యూ పెరగటంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1200 నుంచి రూ.1400 కోట్ల మేర ఆదాయం వస్తుందని చెప్పారు. హయ్యర్ సైడ్ ఏరియాలు శేరిలింగంపల్లి, రాజేందర్ నగర్, ఖాజాగూడ తదితర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగవన్నారు. ఆయా ప్రాంతాల్లో ఛార్జీలు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే ఆలోచన లేదు. ఫ్యూచర్ సిటీని రద్దు చేసే అవకాశమే ఉండదు. త్వరలో తహసీల్దార్ల బదిలీలు ఉంటాయి అని తెలిపారు.
ఇక నుంచి సబ్ రిజిస్టర్లకు ఫుల్ పవర్స్ కట్ చేశామని, వారికి మినిమమ్ పవర్స్ మాత్రమే ఉంటాయని వివరించారు. భూ సేకరణ సమయంలో ప్రభుత్వానికి కొంత నష్టం జరిగిందన్నారు. కానీ రైతులకు మాత్రం లాభం జరుగుతుందన్నారు. ఇన్నర్ సైడ్ ఎకరం కనీసం రూ.15 లక్షలు ఉందని చెప్పారు. లోయర్ సైడ్ ఏమైనా పొరపాటు జరిగితే మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. హయ్యర్ సైడ్ మాత్రం మార్పులు ఉండవన్నారు. సమస్యలు ఉంటే, హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేస్తామని పబ్లిక్‌కు ఆయన సూచించారు. త్వరలో తహసీల్దార్ల బదిలీలు ఉంటాయని చెప్పారు.
…………….


