జర్మనీలో మినీ మహానాడు ఘనంగా జరిగింది. జర్మనీ నుంచే కాక ఐర్లాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, గళ్లా రామచంద్ర రావు పాల్గొన్నారు.ఎన్ఆర్ఐ-టీడీపీ జర్మనీ విభాగానికి సంబంధించి వెబ్ సైట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ ఎల్లలు దాటినా మాతృభూమిని, తెలుగుదేశం పార్టీని ప్రవాసాలు గుర్తుపెట్టుకోవడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. జర్మనీలో మహానాడు నిర్వహించడ పై హర్షం వ్యక్తం చేశారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కుమారుడిగా జన్మించటం తన అదృష్టమని తెలిపారు. కుటుంబం కంటే ప్రజలకే ఎన్టీఆర్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారిని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వ 24 నెలల పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పథంలో 20 ఏళ్ల ముందుకు సాగిందని మన్నవ సుబ్బారావు అన్నారు. జూన్ రెండో తేదీ నిరంకుశత్వానికి చరమగీతం పాడి, ప్రజాస్వామ్యనికి కొత్త అర్థం చెప్పిన రోజని అని వ్యాఖ్యానించారు. మిని మహానాడులో 46 రకాల ఆంధ్ర వంటకాలతో అతిథులకు కమ్మని విందు ఏర్పాటు చేశారు.
మహానాడు కో-ఆర్డినేటర్ వంశీ దాసరి, ఎన్నారై తెదేపా నాయకులు వెంకట్ ఖండ్ర, శ్రీకాంత్ కుడితిపూడి, పవన్ కుర్ర, సుమంత్ కొర్రపాటి, నరేష్ కోనేరు,శివ బత్తల, టిట్టు మద్దిబట్ల , కిషోర్ చలసాని, రావి అమర్ నాథ్, కాట్రగడ్డ వెంకట కృష్ణప్రసాద్ సహా పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

































