నార్వే చెస్ టైటిల్ గెలిచిన గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అదే ఊపులో ఉన్నారు. తమిళనాడు సీఎం విజయ్‌ని కూడా ప్రజ్ఞానంద ఓ గేమ్ లో ఓడించారు. నార్వే టైటిల్ గెలిచిన సందర్భంగా సీఎం విజయ్‌ని ఆ రాష్ట్ర సెక్రటేరియేట్‌లో ప్రజ్ఞానంద కలిశారు. ఆ సమయంలో ఇద్దరూ కాసేపు సరదాగా చెస్ ఆడారు. అయితే కేవలం కొన్ని ఎత్తుల్లోనే సీఎం విజయ్‌కు గ్రాండ్‌మాస్టర్ చెక్ పెట్టేశారు. చెస్ స్టార్ ప్రజ్ఞానందకు 50 లక్షల ప్రత్యేక నజరానా సీఎం అందజేశారు. అయితే సీఎం విజయ్ చెస్ ఆడిన తీరును ప్రజ్ఞానంద మెచ్చుకున్నారు. సీఎంతో చెస్ ఆడడం అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందన్నాడు. విజయ్, ప్రజ్ఞానంద చెస్ ఆడిన విలువల్స్ను రిలీజ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన నగదు పురస్కారం తనలో ప్రేరణ ఇస్తోందన్నారు. సీఎం విజయ్ చెస్ ఆడుతారన్న సంగతి తనకు తెలియదని, చెస్ బోర్డు తెమ్మన్నారని, టేబుల్‌పై చెస్ ఆడామని ప్రజ్ఞానంద తెలిపారు. తన స్నేహితులతో కలిసి చెస్ ఆడేవాడినని సీఎం విజయ్ చెప్పినట్లు తెలిపారు. గేమ్ నేనే గెలిచినా, సీఎం బాగా ఆడారని అన్నాడు.
.

































