విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. కార్మికులు, యాజమాన్యంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి, స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం గతంలో ఎప్పుడూ జరగలేదు. 30 ఏళ్లలో ఇలాంటి ఘటనను మేము ఎప్పుడూ చూడలేదని కార్మికులే చెబుతున్నారన్నారు. విశాఖ ఉక్కును కాపాడటమే కాదు ఉత్పత్తి కూడా తిరిగి ప్రారంభించామని, ఇలాంటి సమయంలో స్టీల్‍ప్లాంట్‍లో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఎప్పుడూ లేనివిధంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగమిస్తామని, కుటుంబాలకు శాశ్వతంగా అండగా నిలబడేందుకు ఎన్డీయే అడుగేసిందన్నారు. ఒక్కో కుటుంబం పరిస్థితి చూస్తే చాలా బాధ వేస్తోందని, కార్మికుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని లోకేష్ తెలిపారు. మంత్రి లోకేశ్‌తో పాటు కేంద్రమంత్రి భూపతి రాజు, హోంమంత్రి అనిత, ఎంపీ భరత్, పల్లా శ్రీనివాసరావు బాధితులను పరామర్శించారు.
……

































