వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. మద్య నిషేధ హామీని తుంగలో తొక్కి, కల్తీ మద్యంతో 30 వేల మంది ప్రాణాలను గొడ్డలి పార్టీ బలితీసుకుందని ధ్వజమెత్తారు. బాబాయి హంతకులను కాపాడుతూ, న్యాయం కోరిన సొంత చెల్లికే జగన్ వెన్నుపోటు పొడిచారని ఆగ్రహించారు. విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచి, ప్రజలపై రూ.32 వేల కోట్ల మోయలేని భారం మోపారని దుయ్యబట్టారు. మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ హామీలను అటకెక్కించి ఐదేళ్లలో 4,100 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యారని విమర్శించారు. జగన్ హయాంలో 85శాతం హామీలను తుంగలో తొక్కితే, కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే 90శాతం సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చిందని ఉద్ఘాటించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. గొడ్డలిపార్టీ దొంగనాటకాలు ఆడుతూ మరొకసారి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

































