అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ఒప్పందంతో పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనడమే కాకుండా సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొద్ది నెలలుగా పశ్చిమాసియాలో కొనసాగిన ఘర్షణల వల్ల అనేక దేశాల్లో ప్రాణనష్టం సంభవించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించి, శాశ్వత పరిష్కారానికి దోహదపడుతుంది. సుస్థిరమైన తుది ఒప్పందం కుదిరేలా, మిగిలిన అంశాలపై కూడా సానుకూల చర్చలు కొనసాగుతాయని ఆశిస్తున్నాం అని మోదీ పేర్కొన్నారు.

































