My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra - Latest News

అమర్నాథ్ ఆ మాటలు మాట్లాడొద్దు : పవన్

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలని, కానీ విధానపరంగానే ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి, వైసిపి నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు పవన్ రీకౌంటర్ ఇచ్చారు. మహిళల గురించి మాట్లాడుటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మహిళల కట్టుబొట్టు గురించి మాట్లాడే స్థాయికి వైసిపి నేతలు దిగజారిపోయారన్నారు. కేవలం అనితను అన్నట్టు కాదని మహిళలందరినీ కించపరిచినట్లేనని మండిపడ్డారు. ఒక విషయం మాట్లాడేటప్పుడు నచ్చకపోతే ఆ విషయాన్ని విమర్శించాలన్నారు. […]

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలని, కానీ విధానపరంగానే ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి, వైసిపి నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు పవన్ రీకౌంటర్ ఇచ్చారు. మహిళల గురించి మాట్లాడుటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మహిళల కట్టుబొట్టు గురించి మాట్లాడే స్థాయికి వైసిపి నేతలు దిగజారిపోయారన్నారు. కేవలం అనితను అన్నట్టు కాదని మహిళలందరినీ కించపరిచినట్లేనని మండిపడ్డారు. ఒక విషయం మాట్లాడేటప్పుడు నచ్చకపోతే ఆ విషయాన్ని విమర్శించాలన్నారు. వైసిపి వాళ్లు మాట్లాడే మాటలు ఎంతటి అభ్యంతరకరమైనవో ప్రజలకు వివరించాలని, ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను బలంగా తిప్పికొట్టాలని పవన్ పేర్కొన్నారు. ప్రజలు హర్షించే భాషలోనే కూటమి నేతలు మాట్లాడాలని సలహా ఇచ్చారు. నోటికొచ్చినట్లు ఇళ్లలో మహిళలను కించపరిచే విధంగా వైసిపి వాళ్లు మాట్లాడుతున్నారని, వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
………

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.