ప్రాంతీయవాదాన్ని వేర్పాటువాదంతో పోల్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. కరీంనగర్లో తెలంగాణ రక్షణ సేన జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసు పెట్టడం చేతకాని ప్రభుత్వం తెలంగాణలో ఉందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ విషయాన్ని ప్రాధాన్యత లేని అంశంగా భావిస్తోందన్నారు. రేవంత్ రెడ్డి సిఎం అయ్యాక పలువురు నేతలు తెలంగాణ భావజాలంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమానికి అండగా నిలిచిన కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం ప్రజల త్యాగాలను అవమానించినట్లే అని అన్నారు.

































