అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు మెడికల్ అడ్వైజర్‌గా ఉన్న డాక్టర్ ఆంథోనీ ఫౌసీ చైనాలోని వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు ఫండింగ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కోవిడ్19 వ్యాప్తికి కారణమైన ఆ ల్యాబ్‌పై సమాచారాన్ని దాచి పెట్టే విధంగా ఫౌసీ ప్రవర్తించినట్లు ఆమె తెలిపారు. వుహాన్ ల్యాబ్ గురించి అమెరికా కాంగ్రెస్‌ను కూడా ఫౌసీ తప్పుదోవ పట్టించారని తులసీ గబ్బార్డ్ పేర్కొన్నారు. నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ హోదా నుంచి వైదొలుగుతున్న తులసీ గబ్బార్డ్, తన ఆఫీసు చివరి రోజున ఈ సంచలన విషయాలను వెల్లడించారు.
కరోనా వైరస్ వ్యాప్తికి, చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్‌కు కనెక్షన్ ఉన్నట్లు గతంలో అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తన వద్ద ఉన్న క్లాసిఫైడ్ సమాచారాన్ని బయటపెడుతున్నట్లు తులసీ పేర్కొన్నారు. కోవిడ్ వివాదంలో ఫౌసీ పాత్రను బుట్టదాఖలు చేయాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ఆమె చెప్పారు. తాను రిలీజ్ చేసిన సమాచారంలో గతంలో వెల్లడి కాని అనేక విషయాలు ఉన్నట్లు ఆమె చెప్పారు. వుహాన్‌లోని కరోనా వైరస్ రీసర్చ్ సంస్థకు ఫౌసీ నిధులు అందించినట్లు ఆమె ఆరోపించారు.

































