ఓవైపు ఇరాన్, అమెరికా శాంతి చర్చల ఒప్పందంపై ఏకాభిప్రాయంతో యుద్ధానికి స్వస్తి పలుకుతుంటే మరోవైపు ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడులు చేస్తూ అశాంతిని ప్రేరేపిస్తోంది. బేక వ్యాలీలో వైమానిక దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. ఈ దాడుల ప్రభావం యూఎస్-ఇరాన్ శాంతి చర్చల మీద పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ వేదికగా ఎంఓయూ హార్డ్ కాపీపై ట్రంప్ సంతకం చేయగా, టెహ్రాన్‌లో పెజెష్కియాన్ సంతకం చేసిన విషయం తెలిసిందే. అమెరికా-ఇరాన్ స్వీట్జర్లాండ్ వేదికగా సదురు ఒప్పందం అధికారికంగా చర్చలు సాగించనున్నాయి. తాజాగా ఈ క్రమంలోనే స్విజ్జర్లాండ్ వేదికగా జరగాల్సిన యూఎస్-ఇరాన్ శాంతి చర్చలు వాయిదా పడనున్నాయి. లెబనాన్ పై వరుస దాడులతో ఇజ్రాయిల్ శాంతి చర్చలకు విఘాతం కలిగిస్తోంది. లెబనాన్ పై నిరంతర దాడులు ఆపినప్పుడే శాంతి చర్చలు సజావుగా జరుగుతాయని ఇరాన్ స్పష్టం చేసింది.
మరోవైపు సంతకాల అనంతరం జరగాల్సిన సమావేశానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ పర్యటన వాయిదా వేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. రెండు దేశాల మధ్య ఒప్పందం అమలులో భాగంగా 60 రోజుల కాల వ్యవధి ఉండటంతో పలు అంశాలపై సుదీర్ఘ చర్చలు అవసరమని అమెరికా భావిస్తోందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.

































