ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో రసాభాస నెలకొన్నది. ఇజ్రాయిల్ ప్రతినిధి డాన్నీ డాన్, ఐక్యరాజ్యసమితి అధికారి వన్నెసా ఫ్రేజర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. యుద్ధ క్షేత్రాల్లో పిల్లలపై లైంగిక హింస అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇజ్రాయెల్ ప్రతినిధి, యూఎన్ అధికారి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగింది. ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. యుద్ధ క్షేత్రాల్లో లైంగిక హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం నేపథ్యంలో చర్చలో పాల్గొన్న ఇజ్రయెల్ ప్రతినిధి డాన్నీ డానన్ మాట్లాడుతూ ప్రమీలా పాట్టెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్లో లైంగిక హింస ఘటనలు జరిగాయని, ఆ దేశాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రమీలా తన రిపోర్టులో పేర్కొన్నారు.అయితే ఆ నివేదికను ఇజ్రాయెల్ తప్పుపట్టింది. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆదేశాల మేరకు ఇలాంటి నివేదికలు తయారు చేశారని డానన్ ఆరోపించారు.

































