బండి భగీరథ్‌కు బెయిల్ లభించింది. ఏడు రోజుల పాటు హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో ప్రత్యేక పోక్సో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. భగీరథ్ తన చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా కోర్టు ఈ తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మధ్యంతర బెయిల్ ఏడు రోజుల కాలానికి మాత్రమే పరిమితమని, కోర్టు విధించిన షరతులకు లోబడి ఉంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పోక్సో కేసులో భగీరథ్‌ను పేట్ బషీరాబాద్ పోలీసులు మే 16న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

































