రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆఱ్) సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు నుంచి జులై 24 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా హిమాయత్‌నగర్ వార్డు కార్యాలయంలో బిఎల్‌ఒలకు ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులు అందించారు. బిఎల్ఒలు ఇంటింటికీ వెళ్లి వీటిని ఓటర్లకు అందజేస్తారు. ఓటర్లే ఈ దరఖాస్తులను పూర్తి చేసి, బిఎల్‌ఒలకు అందజేయాలను అధికారులు సూచించారు. రెండు రోజుల తర్వాత బిఎల్ఒలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు సేకరిస్తారు. ఏదైనా అత్యవసర సేవల కోసం 1950 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఒక వేళ బిఎల్ఒలు ఇంటికి రాకపోయినా, టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లిష్‌లో, మిగితా జిల్లాల్లో తెలుగులో పత్రాలు అందించనున్నారు. బిఎల్వొలు ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్లి ఓటర్లకు వాటిని అందజేయాలి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,38,26,448 ఓటర్లకూ వాటిని ఇవ్వాలి. ఓటర్లు వాటిని పూర్తి చేసి వచ్చే నెల 24లోపు బిఎల్వొలకు అందించాలి.

































