భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఇండోనేషియా రాజధాని జకార్తాకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వయంగా విచ్చేసి సాదర స్వాగతం పలికారు. ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి అధ్యక్షుడు స్వయంగా రావడం ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహ బంధానికి అద్దం పడుతోంది.
అంతకుముందు, ప్రధాని ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే ఆ దేశ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా నిలిచి గౌరవ వందనం సమర్పించాయి. జకార్తా ఎయిర్‌పోర్టులో ఇండోనేషియా సంప్రదాయ నృత్యాలతో భారత ప్రధానికి ఘన సంస్కృతిక స్వాగతం లభించింది.

































