అమెరికాలోని మిన్నెసోటాలోని ఒక క్యాథలిక్ పాఠశాలలో కాల్పుల సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, 14 మంది విద్యార్థులు సహా మొత్తం 17 మంది గాయపడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు చిన్నారులు సహా షూటర్ కూడా చనిపోయాడు. ఈ ఘటనపై గవర్నర్ విచారం వ్యక్తం చేయగా, అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందవద్దు అన్నారు.
Where can I get some?
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. పాఠశాలలో చోటు చేసుకున్న కాల్పుల్లో ఇద్దరు చిన్నారులతో పాటుగా.. కాల్పులకు పాల్పడిన దుండగుడు కూడా చనిపోయాడు. మరో 17 మందికి గాయాలయ్యాయని.. వీరిలో 14 మంది పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. ఈ సంఘటన అమెరికా మిన్నెసోటా మినియాపొలిస్‌లో ఉన్న ఓ క్యాథలిక్ పాఠశాల ప్రాంగణంలో వెలుగు చూసింది. స్కూల్ తెరిచిన రెండు రోజులకే ఇలాంటి సంఘటన వెలుగు చూడటం సంచలనంగా మారింది. ఆ వివరాలు..


బుధవారం నాడు అనగా ఆగస్టు 27న ఈ దారుణం వెలుగు చూసింది. యానుసియేషన్ క్యాథలిక్ చర్చికి అనుసంధానంగా ఉన్న మినియాపొలిస్ పాఠశాలలో దుండగుడు ఒకరు కాల్పులకు పాల్పడ్డాడు. విద్యార్థులు ఉదయం ప్రార్థన చేస్తుండగా.. స్కూల్ ఆవరణలోకి ప్రవేశించిన నిందితుడు.. ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ దారుణంలో ఇద్దరు అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆయుధాలతో స్కూల్‌లోకి వచ్చిన దుండగుడు.. కిటికీల గుండా పిల్లలపైకి కాల్పులకు తెగబడ్డాడు.

ఆ తర్వత నిందితుడు తనను తాను షూట్ చేసుకుని చనిపోయాడని అధికారులు వెల్లడించారు. నిందితుడు వయసు 20 ఏళ్లు ఉంటుందని తెలిపారు. కాల్పుల ఘటనలో సుమారు 17 మంది గాయపడ్డారని.. వీరిలో 14 మంది విద్యార్థులే అని అధికారులు తెలిపారు. ఈ పాఠశాలలో మొత్తం 350 మంది విద్యార్థులు చదువుతున్నారని వెల్లడించారు. ఈ సంఘటన మీద మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పసిపిల్లలపై ఇలా కాల్పులకు తెగబడటం దారుణమన్నారు.


