భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణ ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నది. రాధాకృష్ణన్తో శుక్రవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం స్వీకారం చేయించనున్నారు.

పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి అయిన రాధాకృష్ణన్, ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామ చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.



